వెంకీ కూతురు సాహ‌సం..ఏం చేసిందో తెలిస్తే మ‌తిపోవాల్సిందే!

ఎస్తర్ అనిల్.. అంటే గుర్తు ప‌ట్ట‌డం క‌ష్ట‌మే. కానీ, విక్ట‌రీ వెంక‌టేష్ కూతురు అంటే ట‌క్క‌న గుర్తుకు వ‌స్తుంది. వెంకీ ప్రధాన పాత్ర‌లో తెర‌కెక్కిన దృశ్యం చిత్రంలో ఆయ‌న‌కు చిన్న కూతురుగా న‌టించిన చిన్నారినే ఎస్త‌ర్ అనిల్‌. అయితే చైల్డ్ ఆర్టిస్ట్‏గా గుర్తింపు తెచ్చుకున్న ఎస్తర్ ఇప్పుడు హీరోయిన్‏గా మారేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఎస్త‌ర్ చేసిన సాహ‌సం అంద‌రి చేత ఓరా అనిపించింది. ఇంత‌కీ ఈమె ఏం చేసింది..? అనేగా మీ సందేహం.. ఓ అంద‌మైన గౌను ధ‌రించి ఫొటోల‌కు పోజులిచ్చింది. అందులో పెద్ద సాహ‌సం ఏముంది అని అనుకుంటున్నారా..? అయితే అక్క‌డికే వ‌స్తున్నా ఆగండి.. ఎస్తర్ అనిల్ వ‌య‌సు 19 సంవ‌త్స‌రాలు. ఆమె బరువు 44 కేజీలు.

44 కేజీల హీరోయిన్ 58 కేజీల గౌను ధరిస్తే.. అయినా అందాలు దాగలేదు! | Drushyam fame Esther Anil wears 58 kg dress

కానీ, తాజాగా ఆమె ధ‌రించి గౌను బ‌రువు ఏకంగా 58 కేజీలు. అవును.. 44 కేజీల బరువున్న ఎస్తర్.. 58 కేజీల బరువున్న గౌను ధరించి ఫోటో షూట్‏లో పాల్గొంది. దాంతో ఈమె పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఈ పిక్స్‌లో ఎస్తర్ అందాలు చూస్తే ఎవ్వ‌రికైనా మ‌తిపోవాల్సిందే. ఇక గౌను విషయానికి వస్తే.. దీనిని 30 రోజుల పాటు శ్రమించి డిజైన్ చేశారట. ఈ అద్భుతమైన గౌనుని ధరించడం ఎంతో సంతోషంగా ఉంది అని ఎస్తర్ అంటోంది.

https://www.instagram.com/reel/CSUEgIqJipG/?utm_source=ig_web_copy_link