మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న హన్సిక ఫోటోలు వైరల్..!

దేశముదురు సినిమాతో తెలుగులో పరిచయమైన హీరోయిన్ హన్సిక. తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఇక యువ హీరోలతో కొన్ని సినిమాల్లో నటించినా అవి బ్లాక్ బాస్టర్ లిస్ట్ లోకి వెళ్లి పోయాయి. స్టార్ హీరోలతో కలిసి సెకండ్ హీరోయిన్ గా నటించిన అది కూడా వర్కవుట్ కాలేదు. దాంతో ఈమె ఏ భాషలో అయినా చిన్న పెద్ద అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూ ఉంది.

సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ చాలామందిని పోగు చేసుకుంది ఈ భామ. తన హాట్ హాట్ ఫోజులతో కొన్నిసార్లు ఫోటోలు పెట్టి అందరినీ షాక్ కు గురిచేస్తుంది. అయితే మొన్న తన పుట్టినరోజు సందర్భంగా ఆమె తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక వెకేషన్ కు వెళ్ళింది. అక్కడ ఆమె తన అందాలను సెల్ఫీలో బంధించి, అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదిక అయిన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది.

అంతేకాదు తన స్నేహితులు హన్సిక పుట్టిన రోజు సందర్భంగా.. ఆమెకు తెలియకుండానే తన ఇంట్లో డెకరేషన్ చేసి, బర్తడే శుభాకాంక్షలు తెలిపినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిసింది. ఇక ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే, ఈమె తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ ముద్దుగుమ్మ చూపించినటువంటి కొన్ని ఫోటోలు ఇప్పుడు కాస్త వైరల్ గా మారాయి. అయితే ఈ పుట్టినరోజు అయినా ఈమెకు కలిసొస్తుందో లేదో వేచిచూడాలి. ఏది ఏమైనా హన్సిక ఇలాంటి ఫోటోలను షేర్ చేయడం వల్ల తన అభిమానులకు ఒక్కసారిగా షాక్ తగ్గినట్లు అనిపించింది.