సెట్స్‌పైకి `బంగార్రాజు`..సంద‌డి చేసిన చైతు-కృతి!

అక్కినేని నాగార్జున, డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `బంగార్రాజు`. సోగ్గాడే చిన్ని నాయ‌నా మూవీకి ప్రీక్వెల్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున త‌న‌యుడు, యువసామ్రాట్ నాగచైతన్య కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.

Bangarraju Movie: సస్పెన్స్‏కు చెక్ పెట్టిన నాగ్.. ఎట్టకేలకు పట్టాలెక్కిన  బంగార్రాజు.. | nagarjuna and nagachaitanya kritishetty movie bangarraju  shoot started | TV9 Telugu

గ్రామీణ నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ.. చైతూకు జంటగా కృతి శెట్టి నటిస్తున్నారు. అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నారు. అయితే నేడు శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్య‌క్ర‌మంతో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లింది.

Akkineni Nagarjuna: Bangarraju shooting starts .. Crazy update on Naga  Chaitanya's character! - Hayat News

ఈ కార్య‌క్ర‌మంలో నాగార్జున, క‌ళ్యాణ్ కృష్ణ‌, ఇతర చిత్రబృందంతో పాటు నాగచైతన్య, కృతిశెట్టి కూడా సంద‌డి చేశారు. కాగా, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున అక్కినేని నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగ‌ష్ణు 25 నుంచి మొదలవనుందని తెలుస్తోంది.