వామ్మో..అరియానా ఏంటి ఇలా మారిపోయింది..చూస్తే తట్టుకోలేరేమో!!

అరియానా గ్లోరీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యాంక‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ రామ్ గోపాల్ వ‌ర్మ ఇంట‌ర్వ్యూతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో అడుగు పెట్టి.. త‌న‌దైన ఆట తీరుతో తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ పాపుల‌ర్ అయింది.

Here's what Ariyana Glory is upto post Bigg Boss Telugu 4 | Times of India

ఈ షో త‌ర్వాత అరియానా టీవీ షోలే కాకుండా ప‌లు సినిమాల్లోనూ ఆఫ‌ర్లు ద‌క్కించుకుంటోంది. అలాగే ఆర్య ఈవెంట్ ప్లానర్స్ అనే సంస్థను ప్రారంభించి బిజినెస్ కూడా చేస్తోంది. ఇక సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అరియానా.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ త‌న ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇస్తుంటుంది.

Bigg Boss Ariyana Glory Dance Performance | Anchor Ariyana Glory Latest Videos - YouTube

అయితే తాజాగా ఈ భామ ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో అరియానా అచ్చం భామ్మ‌లా మారిపోయింది. ఎప్పుడూ సూప‌ర్ హాట్‌గా క‌నిపించే ఈ భామ‌..తాజాగా ఓ ఇన్‌స్టా ఫిల్టర్‌తో ముస‌లి దానిలా మారిపోయింది. దాంతో ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు విస్తుపోతున్నారు. అరియానా ఏంటి ఇలా మారిపోయిందంటూ షాక్ అవుతున్నారు. మొత్తానికి భామ్మ‌లా మారిన ఈ భామను చూసి త‌ట్టుకోలేక‌పోతున్నారు ఫ్యాన్స్‌.

https://youtu.be/HW-yvW4AMVU