ఆ హీరోయిన్‌ను వ‌దిలేదే లే అంటున్న నిఖిల్‌..అస‌లు మ్యాట‌రేంటంటే?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ ఓ హీరోయిన్‌ను వ‌దిలేదే లే అంటున్నాడు. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవ‌రో కాదు అనుపమ పరమేశ్వరన్‌. అస‌లు మ్యాట‌రేంటంటే.. నిఖిల్ ప్ర‌స్తుతం సూర్య ప్రతాప్ దర్శకత్వంలో 18 పేజెస్ అనే సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుప‌మ పరమేశ్వరన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Anupama Parameswaran in Helen remake? - tollywood

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 18 పేజెస్ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అలాగే నిఖిల్ మ‌రోవైపు కార్తికేయ సినిమాకు సీక్వెల్ కార్తికేయ 2 ను కూడా చేస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని చాలా రోజులు రహస్యంగా ఉంచారు. కానీ, నిన్న కృష్ణాష్టమి సందర్భంగా కార్తికేయ 2 సినిమాలో నటిస్తున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అంటూ నిఖిల్‌ రివీల్ చేసేశాడు.

Innocent Anupama Parameswaran in Nikhil Karthikeya 2? - tollywood

మొత్తానికి నిఖిల్ అనుప‌మ‌ను వ‌దిలిపెట్ట‌కుండా..వ‌ర‌స‌గా త‌న సినిమాల్లోకి తీసుకుంటున్నాడ‌న్న‌మాట‌. కాగా, `అ ఆ` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ భామ అనుపమ కెరీర్ ప్రారంభంలో రెండు, మూడు హిట్లు ఖాతాలో వేసుకున్నా.. ఆ త‌ర్వాత ఈమె గ్రాఫ్ పూర్తిగా డ‌ల్ అయిపోయింది. అవ‌కాశాలు కూడా త‌గ్గిపోయాయి. ఒక దశలో చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేని అనుపమకు.. ఇక్కడ కెరీర్ అయిపోయినట్లే అని భావించారు. అలాంటి త‌రుణంలో 18 పేజెస్ లో ఛాన్స్ కొట్టేసిన అనుప‌మ‌.. ఇప్పుడు కార్తికేయ 2లోనూ న‌టిస్తోంది.