ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా హాట్ యాంకర్‌గా తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది అనసూయ భరధ్వాజ్. మరోవైపు వెండితెరపై మంచి నటిగా కూడా సత్తా చాటుతున్న ఈ బ్యూటీ.. మొన్నీమధ్య `థాంక్యూ బ్రదర్` సినిమాలో గర్భవతిగా ఛాలెంజింగ్ రోల్ చేసి ప్రేక్షకులను మెప్పించింది.
ప్రస్తుతం అనసూయ టీవీ షోలే కాకుండా పుష్ప, రంగమార్తాండ తదితర చిత్రాల్లో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అనసూయ హాట్ హాట్ ఫొటో షూట్లతో తరచూ తన అభిమానులను అలరిస్తుంటుంది. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా అందాల ఆరబోతలో ఎప్పటికప్పుడు హద్దులు దాటేస్తూ అందరి చేత ఔరా అనిపిస్తుంటుంది.
తాజాగా కూడా మోకాళ్ళ పైకి ఉన్న గౌను ధరించి థైస్ అందాలు, ఎదపై టాటూను చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక అనసూయ గ్లామర్ షో చూసిన నెటిజన్లు..ఇలాగైతే నిద్ర పట్టడం కష్టమే అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతలా ఆమె పిక్స్ వారిని అలరిస్తున్నాయి.