కూతురు బ‌ర్త్‌డే పార్టీలో సురేఖ‌వాణి ర‌చ్చ ర‌చ్చ..వీడియో వైర‌ల్‌

August 8, 2021 at 11:38 am

సురేఖ‌వాణి.. ఈ పేరుకు కొత్తగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వదిన, అక్క, చెల్లి, తల్లి వంటి పాత్రల్లో అలవోకగా ఒదిగిపోయి ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డంలో సురేఖ వాణి మ‌హా దిట్ట‌. ఈ నేప‌థ్యంలోనే తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సురేఖ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.

ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సురేఖ వాణి ఎప్ప‌టిక‌ప్పుడు కూతురు సుప్రితతో క‌లిసి హాట్ హాట్ ఫొటో షూట్లు, డ్యాన్స్ వీడియోలు చేస్తూ అల‌రిస్తుంది. అయితే నేడు (ఆగస్టు 8) సుప్రిత పుట్టిన రోజు సందర్భంగా తల్లీకూతుళ్లిద్దరూ కలిసి గోవాకు వెళ్లి.. అక్క‌డ జాలీగా గడిపారు.

అంతేకాదు, కూతురు బ‌ర్త్‌డే పార్టీలో మోడ్ర‌న్ దుస్తులు ధ‌రించి సురేఖ సూప‌ర్‌గా స్టెప్పులు వేస్తూ ర‌చ్చ ర‌చ్చ చేసింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించి వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇక ఈ వీడియోపై కొంద‌రు అదిరింది, వావ్ అంటూ కామెంట్లు పెడుతుంటే.. మ‌రికొంద‌రు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు.

కూతురు బ‌ర్త్‌డే పార్టీలో సురేఖ‌వాణి ర‌చ్చ ర‌చ్చ..వీడియో వైర‌ల్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts