వైర‌ల్‌ అవుతున్న ప్రియాంక ఫొటోలు..!

మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన తెలుగమ్మాయి ప్రియాంక. 2017లో వ‌చ్చిన క‌ల‌వ‌ర‌మాయే సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో అంత పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘టాక్సీవాలా’తో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా త‌ర్వాత చాలా స‌మ‌యం తీసుకున్న ప్రియాంక తిమ్మ‌ర‌సు చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది.

అయితే రీసెంట్‌గా తిమ్మ‌ర‌సు చిత్రంలో న‌టించిన ఈ ముద్దుగుమ్మ సోష‌ల్ మీడియాలో అందాల‌తో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.
ఆమె ఫోటోలు చూస్తే కుర్ర‌కారుకు మ‌తిపోతుంది. ప్రియాంక‌ను ఇలా చూడటంతో ఫ్యాన్స్ ప‌రేషాన్ అవుతున్నారు. ఆ మ‌ధ్య ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక తన శరీరంలో వచ్చిన మార్పులపై ఆమె ఇలా స్పందించారు. టాక్సీవాలా సినిమా తర్వాత చాలా లావుగా మారానని, దీనికి కారణం థైరాయిడ్‌ సమస్యతో బాధ‌ప‌డుతున్నాన‌ని తెలిపింది. ముఖమంతా మొటిమలు వచ్చాయని ఆస్పత్రికి వెళ్లి చెక్ చేసుకుంటే థైరాయిడ్ ఉంద‌ని డాక్ట‌ర్లు తెలిపార‌ని పేర్కొంది. వ్యాయామాలు, యోగా చేయడంతోపాటు ప్రత్యేక డైట్ తీసుకోవండ వ‌ల్లే ఇలా మారాన‌ని తెలిపింది.