వాట్సాప్‌పై కేసు పెట్టిన ఆ దేశం..?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ ఉండదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
అంతలా కస్టమర్స్‌ను అట్రాక్ట్ చేస్తున్న ఈ యాప్‌పై కేసు పెట్టింది ఓ దేశం. అసలు ఆ దేశం వాట్సాప్‌పై కేసు ఎందుకు నమోదు చేసిందో తెలియాలంటే మీరు ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే.

తమ దేశ వ్యక్తిగత డేటా చట్టాన్ని ఉల్లంఘించిందనే ఆరోపణతో వాట్సాప్ సంస్థపై రష్యా దేశంలో కేసు నమోదు అయింది. తమ దేశ పౌరుల డేటాను తమ దేశంలోనే స్టాక్ చేయడంలో వాట్సాప్ సంస్థ విఫలమైందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రష్యా సర్కారు వాట్సాప్‌పై చర్యలకు పూనుకుంది. వాట్సాప్ సంస్థపై కేసు నమోదు చేశారు ఆ దేశ అధికారులు మాట్లాడుతూ నిషేధించిన కంటెంట్‌ను తొలగించడంలో వాట్సాప్ విఫలమైందని ఆరోపించారు. ఇదిలా ఉండగా మాస్కోలో ఆఫీసులు ఓపెన్ చేయడానికి విదేశీ టెక్ ఇనిస్టిట్యూట్స్‌ను బలవంతం చేయడానికి ప్రయత్నించినట్లు వాట్సాప్ సంస్థపై ఆరోపణలున్నాయి. కాగా, ఈ ఆరోపణల విషయమై వాట్సాప్ సంస్థ ఇంతవరకు స్పందించలేదు. ప్రస్తుతం రష్యాలో నమోదైన కేసులో వాట్సాప్‌ సంస్థ దాదాపు 6 మిలియన్‌ రూబుల్స్‌ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. విచారణ తేదీలను కోర్టు ఇంకా నిర్ణయించలేదని సమాచారం.