చిరు మూవీ కోసం రంగంలోకి దిగుతున్న ఆ బిజీ యాక్ట‌ర్‌?!

July 20, 2021 at 10:49 am

ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ త‌ర్వాత మ‌ల‌యాళంలో హిట్ అయిన లూసిఫ‌ర్ రీమేక్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శ‌క‌త్వ వ‌హించ‌నున్నాడు. ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్‌ సిద్ధం కాగా, త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

Lucifer' Telugu remake starring Chiru to be directed by Sujeeth | The News  Minute

అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రంలో ప్ర‌ముఖ న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని కూడా న‌టించ‌బోతున్నాడ‌ట‌. ఈ మూవీలో ఓ కీల‌క పాత్ర కోసం స‌ముద్ర‌ఖ‌నిని సంప్ర‌దించ‌గా.. ఆయ‌న ఓకే చెప్పిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా, ద‌ర్శ‌కుడి నుంచి న‌టుడిగా మారిన స‌ముద్ర‌ఖ‌ని.. త‌న స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కులను క‌ట్టిప‌డేస్తుంటారు. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన అల.. వైకుంఠపురములో సినిమాలో ఈయ‌న చేసిన‌ అప్పలనాయుడు పాత్రకు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది.

P Samuthirakani: The Tough Guy of Tamil Cinema | Entertainment News,The  Indian Express

ఈ సినిమా త‌ర్వాత తెలుగు, త‌మిళ సినిమా అవ‌కాశాల‌తో తీరిక లేకుండా బిజీ బిజీగా గ‌డిపేస్తున్నాడీయ‌న‌. మోస్ట్ వాంటెడ్ యాక్ట‌ర్‌గా మారిన స‌ముద్ర‌ఖ‌ని ప్ర‌స్తుతం..ప‌వ‌న్‌క‌ళ్యాణ్, రానా చేస్తున్న అయ్య‌ప్పనుమ్ కోశియుమ్ రీమేక్‌, మ‌హేశ్ స‌ర్కారు వారి పాట, ఆర్ఆర్ఆర్ త‌దిత‌ర‌ చిత్రాల్లో న‌టిస్తున్నారు. ఇక ఇప్పుడు చిరు సినిమా కోసం ఈయ‌న రంగంలోకి దిగుతున్న‌ట్టు టాక్ న‌డుస్తోంది.

చిరు మూవీ కోసం రంగంలోకి దిగుతున్న ఆ బిజీ యాక్ట‌ర్‌?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts