`రకరకాల భార్యలు` అంటున్న వ‌ర్మ‌..హీరో ఎవ‌రో తెలుసా?

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌ రామ్ గోపాల్ వ‌ర్మ.. ఈ సారి `రకరకాల భార్యలు` అనే ఓ స‌రికొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్ల‌తో ఈ సిరీస్ తెర‌కెక్కించ‌నున్నార‌ట‌.

ఏడుపుగొట్టు, దెబ్బలాడే రకం, ఫోన్ పట్టుకుంటే వదలని భార్య, అనుమానుపు పిశాచి, ముక్కు మీద కోపం, భర్తను తొక్కి ఉంచే భార్య, పిసినిగొట్టు, గొప్పలు చెప్పుకునే భార్య ఇలా ఎనిమిది రకాల భార్యలు ఈ సిరీస్‌లో ఉంటార‌ట‌. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో రకం భార్యను చూపించ‌నున్నారు.

Image

మగవాడికి ఎలాంటి రకం భార్య దొరికితే జీవితం ఎలా మారుతుందో చెప్పడమే ఈ సిరీస్ ఉద్దేశం. ఇక ఈ సిరీస్‌లో `30 వెడ్స్ 21`తో పాపుల‌ర్ అయిన చైతన్య హీరోగా న‌టించ‌బోతున్నాడు. త్వ‌ర‌లోనే ఈ సిరీస్ షూటింగ్ స్టార్ట్ కానుంది.