ప్రభాస్ నుంచి మరో బిగ్గెస్ట్ అనౌన్సమెంట్ ఎప్పుడంటే .?

బాహుబలితో హీరో ప్రభాస్ వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. జక్కన్న తీసిన బాహుబలి తరువాత ప్రభాస్ సినిమాలపై ఓ రేంజ్ లో ఎక్సపెక్ట్టేషన్స్ పెరిగిపోయాయి. ప్రస్తుతం ఆయన పలు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రభాస్ సినిమాలన్నిటికీ అనౌన్సమెంట్స్ టైం లో ఎలాంటి హైప్ నెలకొందో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో అనౌన్స్ చేసిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కోసం ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదిరిచూస్తున్నారు.

అయితే ఇంతలోనే ప్రభాస్ నెక్స్ట్ ఫిల్మ్ పై కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన నుండి మరో భారీ సినిమా అనౌన్స్మెంట్ సెప్టెంబర్ నెలలో రానుంది అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ క్రియేషన్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారితో ప్రభాస్ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. మరి నిజంగానే ఈ కాంబినేషన్ లో సినిమా రానుందా అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు.