బేబీ బంప్‌తో బాలీవుడ్‌ బ్యూటీ ..?

ప్రముఖ బాలీవుడ్‌ బ్యూటీ నేహా ధూపియా రెండోసారి బిడ్డకు జన్మ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియచేసింది. ఈ విషయాన్ని స్వయంగా నేహా ధూపియా దంపతులు అభిమానులకు తెలపడంతో పాటు, బేబీ బంప్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ…’మంచి క్యాప్షన్‌తో రావడానికి రెండు రోజులు పట్టింది. మేం ఆలోచించిన వాటిలో ఉత్తమమైంది ఇదే.. థ్యాంక్యూ గాడ్‌’ అంటూ కాప్షన్ ను జత చేశారు. దీనితో నేహా ధూపియా పోస్ట్‌పై ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అభినందనలు తెలియచేస్తూ వారి స్టైల్ లో కామెంట్స్ పెడ్తున్నారు.

ఇలా ఇలా ఉండగా నేహా, అండగ్ బేడి వివాహం 2018లో జరగగా, అదే సంవత్సరం నవంబర్‌లో మెహర్‌ అనే బిడ్డ పుట్టింది. ఇక ఈ బ్యూటీ “మిస్ ఇండియా:ది మిస్టరీ” అనే మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతే కాకుండా నేహా “క్యా కూల్ హై హమ్‌”, “షూట్ అవుట్ లోఖండ్‌వాలా” లాంటి సినిమాలలో నటించి అభిమానులకు అక్కట్టుకుంది. ఇక నేహా తెలుగులో నిన్నే ఇష్టపడ్డాను,విలన్, పరమవీర చక్ర సినిమాలలో నటించి మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం నేహా ధూపియా బేబీ బంప్‌ ఫోటో లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.