ముంబైలో కాస్టలీ బంగ్లా కొన్న మెగా హీరో..?

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హవా నడుస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చి తన సత్తా చాటారు. ఇంకా రాబోతున్నారు కూడా. ప్రస్తుతం ఒక్కోక్కరు ఒక్కో సినిమాతో బిజీగా గడుపుతున్నారు. మెగాస్టార్ రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ తర్వాత కూడా పాన్ ఇండియా సినిమా రేంజ్ లో సినిమాలు చేయడానికి సన్నద్దమవుతున్నాడు. తాజాగా ఆయన బాలీవుడ్ వైపు దూసుకెళ్లాలని అనుకుంటున్నాడు.

అందులో భాగంగానే ముంబైలో ఓ ఇల్లును కొనేశాడు. బీచ్ ఫేసింగ్ ఉండే బంగ్లాను రామ్ చరణ్ కొనుగోలు చేశాడు. ఈ మధ్యనే ఈ బంగ్లాకు చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు గృహ ప్ర‌వేశం కూడా చేసినట్లు టాలీవుడ్ గుసగుసలు వినపడుతున్నాయి. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ త‌ర్వాత శంక‌ర్ డైరెక్షన్ లో దిల్‌రాజు నిర్మాత‌గా రామ్ చ‌ర‌ణ్ ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నట్లుగా తెలుస్తోంది.