గారాలపట్టికి బర్త్‌డే విషెస్‌.. వైరల్ పోస్ట్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. తన సినిమాలతో ఎంతో మంది అభిమానులకు చేరువయ్యాడు ఈ హీరో. చాలా మంది లేడీ అభిమానులు కూడా ఈయనకు ఉన్నారు. తన గారాల కూతురు సితార గురించి ప్రతి ఒక్కరికే తెలుసు. చూడ్డానికి చిన్న పిల్లలా ఉన్నా… తన టాలెంట్ తో సితార టాలీవుడ్ ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది.

పట్టుమని పదేళ్లు కూడా నిండక ముందే తాను ఓ యూట్యూబ్ చానల్ ను నడుపుతూ… రెండు చేతులా సంపాదిస్తోంది. సితారను చూసిన అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ రోజు సితార జన్మదినం సందర్భంగా మహేశ్ బాబు విషెస్ చెప్పాడు. ఇప్పుడు ఈ విషెస్ వైరల్ గా మారాయి. తొమ్మిదో పడిలోకి అడుగు పెట్టిన నా చిన్నారి పాపకు జన్మదిన శుభాకాంక్షలు అని ఆయన ట్వీట్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సితార ఫొటోలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం మహేశ్ బాబు సర్కారు వారి పాట మూవీలో నటిస్తున్నాడు.