రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్న సోనాలి బింద్రే..?

ఒక‌ప్పుడు మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న న‌టించిన మంచి పేరు తెచ్చుకుంది సోనాలి బింద్రే. ఆ త‌ర్వాత కూడా కొన్ని సినిమాల్లో న‌టించి బాగానే గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమె ఇంద్ర సినిమాలో చేసి, నటించి మెప్పించింద‌నే చెప్పాలి. ఇప్ప‌టికీ ప్రేక్షకులు ఆమెను గుర్తు పెట్టుకుంటున్నారు. మ‌రి అంతలా ఆమె తన నటనతో అభిమానుల‌ను ఓ రేంజ్‌లో మెస్మరైజ్ కూడా చేసేది .

అయితే ఆమె కెరీర్ మంచి స్టార్ హీరోయిన్ పొజిషన్ లో ఉన్నప్పుడు క్యాన్సర్ వ‌చ్చింది ఆమెకు. దీంతో ఆమె అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటూ అక్క‌డే కొద్ది కాలం గ‌డిపింది. ఆ సమయంలో కొన్ని ఫొటోలను కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేసి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంద‌రికీ తెలియ‌జేసింది. అయితే ఆమె ఇప్పుడు క్యాన్సర్ నుంచి బయట పడ‌టంతో మ‌ళ్లీ కెరీర్‌పై దృష్టి పెట్టింది. ఆమె అభిమానులు ఎలాగైనా మ‌ళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వమని కోరుతున్నారు. అయితే సోనాలి బింద్రే వీటిపై ఎలాంటి సమాధానం ఇవ్వ‌ట్లేదు.