ఆనందయ్య ఐ డ్రాప్స్ కి హైకోర్టు గ్రీన్ సిగ్నల్..?

కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదిక్ మెడిసిన్ కి ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రావడం తెలిసిందే. అయితే కంటి మందు విషయంలో హైకోర్టు బ్రేక్ వేయడంతో తాజాగా
ఆనందయ్య మెడిసిన్ అధ్యాయనా నివేదికను పరిశీలించిన హైకోర్టు ఆనందయ్య కరోనా కంటి మందుకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఆనందయ్య మెడిషన్ తెలుగు రాష్ట్రాలలో జిల్లా కేంద్రాలకు పంపిణీ కార్యక్రమం చేయటంలో ప్రభుత్వం రంగంలోకి దిగి భద్రతా సిబ్బంది ఏర్పాటు చేసి ప్రతి జిల్లా కేంద్రాలకు ఆనందయ్య మెడిసిన్ పంపిణీ చేస్తూ ఉంది. నేటి నుండి ఈ కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైంది.

ముందుగా ప్రతి జిల్లాలో ఐదువేల మంది కరోనా రోగులకు ఈ మందు అందించాలని ఆనందయ్య స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వారి హెల్త్ కండిషన్ డేటా ప్రభుత్వం దగ్గర అడిగి తెలుసుకుంటున్నారు. ఇదే రీతిలో ఆనందయ్య కంటి మెడిసిన్ కి కూడా ప్రభుత్వం నుండి హైకోర్టు నుండి అనుమతులు రావటంతో తెలుగు రాష్ట్రాలలో కరోనా చికిత్స విషయంలో రోగులు కొంత ధైర్యం తెచ్చుకుంటున్నారు.