త్వరలోనే రాజ్ తరుణ్ వివాహం..?

June 7, 2021 at 4:22 pm

టాలీవుడ్ సినీ పరిశ్రమకు ఉయ్యాలా జంపాల మూవీతో ఎంట్రీ ఇచ్చిన హీరో రాజ్ తరుణ్ త్వరలోనే ఒక ఇంటివాడు అవబోతున్నాడు. ఈ ఏడాది ముగిసేసరికి ఈ యువ హీరో పెళ్లి చేసుకొనున్నట్లు తెలుస్తుంది. హీరో రాజ్ తరుణ్ ఇటీవలే హైదరాబాద్ లోని తన కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా రాజ్ తరుణ్ వివాహం అనంతరం ఫ్యామిలీతో కొత్త ఇంట్లో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాడట.

ఐతే ఇప్పటివరకు రాజ్ తరుణ్ తన పెళ్లి గురించి ఎలాంటి విషయాలు బయటకి చెప్పలేదు. ఆ మధ్య రాజ్ తరుణ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ప్రస్తావించగా, తనకి ఇప్పట్లో పెళ్లి గురించి ఎలాంటి ప్లాన్స్ లేవని అన్నారు. కానీ హీరో రాజ్ తరుణ్ అత్యంత సన్నిహితులు మాత్రం రాజ్ అతి త్వరలోనే పెళ్లి చేసుకోనున్నాడని, రాజ్ పెళ్ళికి రెడీ అవుతున్నాడని చెబుతున్నారు. చూడాలి మరి ఈ యువ హీరో ఎవరిని పెళ్లి ఆడనున్నాడో.

త్వరలోనే రాజ్ తరుణ్ వివాహం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts