మ‌రోసారి ఆ యంగ్ హీరోకు ఒకే చెప్పిన ర‌ష్మిక‌..?!

June 19, 2021 at 7:59 am

ప్ర‌స్తుతం వ‌రుస‌ సినిమాల‌తో మంచి జోరు మీద ఉంది ర‌ష్మిక మంద‌న్నా. తెలుగులో అల్లు అర్జున్ స‌ర‌స‌న పుష్ప, శర్వానంద్ స‌ర‌స‌న ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాల్లో న‌టిస్తున్న ర‌ష్మిక‌.. బాలీవుడ్‌లో గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాల్లోనూ చేస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మ‌డు మ‌రో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

మాస్ట్రో సినిమా చేస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఆ త‌ర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా ర‌ష్మిక మంద‌న్నా న‌టిస్తోంది.

Nithiin (aka Nithin, Nitin) Wiki, Age, Girlfriend, Wife, Family, Biography  & More - TheWikiFeed

ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా పూర్తి అయ్యాయ‌ని.. ర‌ష్మిక‌కు క‌థ న‌చ్చ‌డంతో వెంట‌నే ఓకే చెప్పింద‌ని తెలుస్తోంది. కాగా, గ‌తంలో నితిన్, ర‌ష్మిక భీష్మ సినిమాలో జ‌త‌క‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది.

మ‌రోసారి ఆ యంగ్ హీరోకు ఒకే చెప్పిన ర‌ష్మిక‌..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts