ఫ్లయింగ్ సిఖ్‌ మిల్కా సింగ్ మృతి..మోదీ సంతాపం!

June 19, 2021 at 7:30 am

ఫ్లయింగ్‌ సిఖ్‌గా పేరొందిన భారత దిగ్గజ అథ్లెట్‌ మిల్కా సింగ్ మృతి చెందారు. మే 20న కరోనా వైరస్ బారిన పడిన మిల్కాసింగ్.. నెలరోజుల పోరాటం తర్వాత చండీగడ్‌లోని పిజిఐ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 91 సంవత్సరాలు.

తండ్రి మరణించిన విషయాన్ని ఆయన కుమారుడు, దిగ్గజ గోల్ఫర్ జీవ్ మిల్కా సింగ్ ధ్రువీకరించారు. దీంతో మిల్కాసింగ్‌ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిల్కా జీవితం యువతకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. గొప్ప క్రీడాకారుని కోల్పోయామంటూ మోదీ సంతాపం తెలిపారు. అలాగే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, పలువురు కేంద్రమంత్రులు కూడా ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.

కాగా, 20 నవంబరు 1932లో పాకిస్థాన్ పంజాబ్‌లోని గోవింద్‌పూర్‌లో మిల్కాసింగ్ జన్మించారు. పరుగుల పోటీల్లో భారత కీర్తి పతాకను వినువీధుల్లో చాటారు. 1958 జాతీయ క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించారు. 1958లో కామన్వెల్త్ పోటీల్లో 46.6 సెకన్లలోనే 440 గజాల దూరం పరుగెత్తి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఫలితంగా భారత్ తరపున తొలి స్వర్ణం సాధించిన తొలి క్రీడాకారుడిగా రికార్డులకెక్కారు.

ఫ్లయింగ్ సిఖ్‌ మిల్కా సింగ్ మృతి..మోదీ సంతాపం!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts