నాని `మీట్ క్యూట్‌`లో ఫిక్స్ అయిన ప్ర‌ముఖ హీరోయిన్‌!

న్యాచురల్‌ స్టార్ నాని చెల్లెలు దీప్తి ఘంటా రోల్‌.. కెమెరా..యాక్ష‌న్‌ అంటూ దర్శకత్వ బాధ్యతలు చేపట్టింది. ఈమె ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కబోతోన్న మొద‌టి చిత్రం మీట్ క్యూట్‌. నాని సొంత నిర్మాణ సంస్థ వాల్‌ పోస్టర్‌ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సీనియర్‌ నటుడు సత్యరాజ్ కీల‌క పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు క‌నిపించ‌నున్నారు. ఆ ఐదుగురు హీరోయిన్స్ ఎవరనే విషయాన్ని మాత్రం ఒక్కో సందర్భంలో రివీల్ చేస్తానని చెప్పుకొచ్చాడు నాని. అయితే ఆ ఐదుగురు హీరోయిన్ల‌లో ఒక‌రిగా ప్ర‌ముఖ హీరోయిన అదాశ‌ర్మ ఫిక్స్ అయింది.

Here's Adah Sharma's reaction to Vidyut Jammwal's 'not just friends'  comment- The New Indian Express

ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమెనే వెల్ల‌డిస్తూ..ఇప్ప‌టి వ‌ర‌కు నేను న‌టించ‌ని పాత్ర‌ని ఈ సినిమాలో పోషిస్తున్నాను. సరికొత్త క‌థ‌ల్ని, విభిన్న నేప‌థ్యాల్ని ప్రేక్ష‌కుల‌కి అందించేందుకు తెలుగు సినిమా ప‌రిధుల్ని చెరిపేస్తుంటారు నాని. ప్ర‌యోగాలు చేసేందుకు ఎప్పుడూ ముందుంటారాయ‌న‌. అలాంటి ఆయ‌న ప్రాజెక్టులో ఓ భాగ‌మ‌వ‌డం చాలా ఆనందంగా ఉంది అంటూ అదా చెప్పుకొచ్చింది. ఇక మిగతా పాత్రల కోసం కాజ‌ల్ అగ‌ర్వాల్‌, నివేదా థామస్, రుహానీ శర్మ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.