ఆర్ఎక్స్ 100 బ్యూటీ కి బంపర్ ఆఫర్..!

ఆర్ఎక్స్ 100 చిత్రంతో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌ తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ చిత్రంలో అందంతో పాటు మంచి టాలెంట్ ఉన్న ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు మాత్రం రావడం లేదు. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత ఆఫర్స్ బాగానే వచ్చినప్పటికీ, ఏ మూవీ విజయం సాధించలేదు. దీంతో ప్రస్తుతం ఈ అందాల హీరోయిన్ పరిస్థితి ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారానే అభిమానులను ఈ హీరోయిన్ ఎక్కువగా అలరించే ప్రయత్నం చేస్తుంది.

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5కు సంబంధించి ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. జూమ్ ద్వారా అభ్యర్థుల ఆడిషన్లు జరుగుతున్నాయని, ప్రస్తుతం పోటీదారుల జాబితాను సిద్ధం చేస్తున్నారని టాలీవుడ్ గుసగుసలు వినపడుతున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా పాయల్ రాజ్‌పుత్‌ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. జూలై నెలలో ఈ రియాలిటీ షో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. ఈ మేరకు నిర్వాహకుల నుంచి త్వరలోనే ప్రకటన రానుంది అంటున్నారు. ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ లో ఎటువంటి అల్లర్లు చేయనుందో చూడాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిందే.