పెళ్లి పై స్పందించిన టాలీవుడ్ నటి..!

June 6, 2021 at 4:38 pm

తెలుగు సినీ పరిశ్రమలో నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అంజలి. తాను నటించే పాత్రలకు ప్రాణం పోసినట్లుగా నటిస్తుంది. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ హీరోయిన్ నటించింది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది. 2006లో ఫొటో సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు అంజలి పరిచయమైంది. ఆ తర్వాత 2007లో తమిళ సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. అక్కడే వరుసగా సెటిలైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.

కానీ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం అంత గుర్తింపు అందుకోలేకపోయింది. తాజాగా అంజలి పెళ్లి గురించి టాక్ వినిపిస్తుంది. పైగా త్వరలోనే అంజలి పెళ్లి చేసుకోబోతోంది అని వార్తలు కూడా వినిపించాయి. ఇక ఈ నేపథ్యంలో ఈ విషయం గురించి స్పందించిన ఆమె సన్నిహితులు అంజలికి ఇప్పట్లో పెళ్లి చేసుకునే మూడ్ లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అంజలి దృష్టంతా సినిమాలపైనే ఉందని అన్నారు.

పెళ్లి పై స్పందించిన టాలీవుడ్ నటి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts