NTR#31 సినిమాలో నిధి..?

జూనియ‌ర్ ఎన్టీఆర్.. సినీ ఇండ‌స్ట్రీలో ఈ పేరుకు ఒక ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. తాత‌కు త‌గిన మ‌న‌వ‌డిగా..త‌న న‌ట‌వార‌స‌త్వాన్ని పునికిపుచ్చుకున్నాడు. త‌న సొంత ట్యాలాంట్ న‌మ్ముకొని ఎదిగాడు. సినీ ఇండ‌స్ట్రీలో త‌నకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ డ్యాన్స్ చేసినా.. డైలాగ్‌లు చెప్పినా ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. ఆయ‌న డైలాగ్‌ల‌కు కుర్ర‌కారు ప‌డిపోతారు. డ్యాన్స్‌కైతే ఓ ర‌క‌మైన అభిమాలు ఉన్నారు. జై ల‌వ కుశ సినిమాలో త‌న న‌ట‌న‌కు అయితే సినీ విమ‌ర్శ‌కులు కూడా ప్ర‌శంసలు కురిపించారు. ఆ సినిమాలో నిజంగా న‌ట‌సార్వ‌భౌముడే క‌నిపించాడు ప్రేక్షకుల‌కు.

ఇక బిగ్ బాస్ హోస్టింగ్ చేసినా.. స్టేజ్‌పై ఎక్కి యాంక‌రింగ్ చేసినా ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. మాల్టీ ట్యాలెంటెడ్‌గా ఇండ‌స్ట్రీలో గొప్ప పేరు తెచ్చుకున్నాడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌. ఆయ‌న ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాల్లో న‌టిస్తున్నారు. అలాగే ఇటీవ‌ల త‌న 30,31 సినిమాకు సంబంధించిన వివ‌రాలు కూడా విడుద‌ల చేశారు. అయితే తాజాగా ఓ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న ఇస్టార్ట్ శంక‌ర్ ఫేమ్ హీరోయిన్ నిధి అగ‌ర్వాల్‌ను ఎంపిక‌చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ మేర‌కు ఆ సినిమా యూనిట్ ట్విట‌ర్ ఖాతా ద్వారా వివ‌రాలు వెల్ల‌డించింది.