షూటింగ్ పూర్తి చేసుకున్న మ్యాస్ట్రో.. ?

నితిన్‌, న‌భాన‌టేష్ హీరో, హీరోయిన్లుగా న‌టిస్తున్న మాస్ట్రో సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. క‌రోనా, లాక్‌డౌన్ నేప‌థ్యంలో చాలా సినిమాలు పెండింగ్‌లో ప‌డ్డాయి. దాదాపు సినిమా రంగం అంతా ఇబ్బందుల్లో కూరుకుపోయింది. పెద్ద పెద్ద ప్రాజెక్టులే మ‌ధ్య‌లో ఆగిపోయాయి. లాక్ డౌన్ కంటే ముందే షూటింగ్ పూర్తి చేసుకొని, రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలు కూడా ఆగిపోయాయి. భారీ బ‌డ్జెట్‌తో తీసిన సినిమాలు ఎక్కువ రోజుల రిలీజ్ చేయ‌కుండా ఉంచ‌లేము కాబ‌ట్టి.. కొన్ని సినిమాల్లో ఓటీటీల్లో కూడా రిలీజ్ చేశారు. సినిమా ప్రేక్ష‌కులు కూడా చేసేది ఏం లేక ఓటీటీల ద్వారా త‌మ ఇంట్లోనే సేఫ్‌గా సినిమాలు చూశారు.

ఇక షూటింగ్ మ‌ధ్య‌లో ఉన్న సినిమాలు మాత్రం చేసేందేం లేక ప‌రిస్థితులు స‌ద్దుమ‌నిగేదాకా వెయిట్ చేశాయి. ప్ర‌భుత్వాలు అన్‌లాక్ డౌన్ ప్ర‌క్రియ మొద‌లు పెట్టి, స‌డ‌లింపులు ఇచ్చిన త‌రువాత మాత్ర‌మే మ‌ళ్లీ సెట్ ల మీద‌కి వెళ్లాయి. అలాగే హీరో నితిన్ చేస్తున్న ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. అన్‌లాక్ డౌన్ స‌డ‌లింపుల స‌మ‌యంలో మాత్రం వినియోగించుకొని స‌క్సెస్ ఫుల్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమాకు మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీత ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రించాడు.