ఆర్ ఎక్స్ 100 సినిమాతో మంచి హిట్ కొట్టిన హీరో కార్తికేయ. తరువాత కొన్ని సినిమాలు వచ్చినా.. ఆ సినిమా అందించిన హిట్‌ను అందించలేదు. 90 ఎంఎల్ సినిమాతో కొత్తగా ట్రై చేసినా.. గ్యాంగ్ లీడర్ సినిమాలో నెగెటివ్ రోల్ లో నటించినా కార్తికేయ చక్కగా ఒదిగిపోయారు. అయితే మెగా స్టార్ అభిమానిని అని చెప్పుకునే కార్తికేయ ఇప్పుడు మెగాస్టార్ సినిమా పేరుతోనే కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. కార్తికేయ కొత్త సినిమాకు రాజ విక్రమార్క పేరు కన్ఫార్మ్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కూడా సినిమా బృందం విడుదల చేసింది.ఈ సినిమాలో కొంచెం డీసెంట్‌గానే కనిపించునున్నాడని పోస్టర్ ద్వారా తెలుస్తోంది. ఈ సినిమాలో మంచి ఆఫీసర్‌గా కనిపించి ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఈ ప్రాజెక్టుకు ప్రశాంత్ విహారీ సంగీతం అందిచనున్నాడు. ఈ సినిమా కూడా ఆర్ ఎక్స్ 100 మాదిరిగానే పెద్ద హిట్ కావాలని సినిమా అభిమానులు కోరకుంటున్నారు.
Intriguing #KartikeyasNext "MEGA" Title #RajaVikramarka launched by sensational dir @imvangasandeep ?
A @SriSaripalli_ debut directorial⚡ing @ActorKartikeya in a never before thrilling look ?@actortanya @88Ramareddy #AdireddyT @prashanthvihari @SCMMOffl @PulagamOfficial pic.twitter.com/zxvKVZ5Niu
— Team VamsiShekar (@TeamVamsiShekar) June 20, 2021