మ‌హేశ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్‌!

June 11, 2021 at 4:15 pm

మ‌హేశ్ బాబు సినిమా వ‌స్తుందంటేనే ప్రేక్ష‌కుల్లో ఎన్నో ర‌కాల అంచ‌నాలుంటాయి. అలాంటి ఈ సూప‌ర్ స్టార్ సినిమా వ‌చ్చి ఇప్ప‌టికీ చాలా రోజుల‌వుతోంది. మ‌హేశ్‌బాబు లాస్ట్ సినిమా సరిలేరు నీకెవ్వరుతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇక ఇప్పుడు డైరెక్ట‌ర్ పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాను చేస్తున్నాడు మ‌హేశ్‌బాబు.

ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి ఓ షెడ్యూల్‌ని దుబాయ్‌లో పూర్తి చేసుకుంది మూవీ టీం. ఇప్పుడు రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ మూవీకి సంబంధించి అప్‌డేట్ కోసం ఫ్యాన్స ఎదురుచూస్తున్నారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసాక ఆ త‌ర్వాత వ‌రుస‌గా అప్డేట్ లు ఉంటాయ‌ని మేకర్స్ స్ప‌ష్టం చేశారు. జూలై నుంచి సినిమా షూటింగ్ మొద‌ల‌వుతున్న‌ట్టు స‌మాచారం. ఆవెంట‌నే ఒక అప్‌డేట్ ఇస్తామ‌ని మూవీ మేక‌ర్స్ వెల్ల‌డించారు. చూడాలి మ‌రి అప్‌డేట్ ఎలా ఉంటుందో.

మ‌హేశ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts