ష‌కీలా గొప్ప‌మ‌న‌సు..క‌రోనా క‌ష్ట‌కాలంలో నిరుపేద‌ల‌కు అండ‌గా..?!

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ విల‌య‌తాండ‌వం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుపడుతున్న ఈ మ‌హ‌మ్మారిని అదుపు చేసేందుకు ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో ఉపాధి లేక ఎంద‌రో నిరుపేద‌లు రోడ్డున ప‌డుతున్నారు.

అయితే ఇలాంటి వారిని ఆదుకునేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ముందుకు వ‌స్తున్నారు. తాజాగా న‌టి ష‌కీలా కూడా నిరుపేద‌లకు అండ‌గా నిలిచేందుకు ముందుకు వ‌చ్చారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆకలితో అల‌మ‌టిస్తూ రోడ్ల పక్కన తిరగాడుతున్న నిరుపేదలకు అన్నం పెట్టి వారి కడుపు నింపుతున్నారీమె.

ష‌కీలా మంచి మ‌న‌సు.. సామాజిక సేవ‌లో బిజీబిజీ

దీనికి సంబంధించిన ఫొటోలను షకీలా తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఈ సంద‌ర్భంగా రెండు చేతుల్లో ఒక చేతిని మీకోసం, మరో చేతిని ఇతరులకు సాయపడేందుకు ఉపయోగించండి.. పేదలకు చేతనైన సాయం చేయండి.. అంటూ ష‌కీలా పేర్కొంది. ఇక ష‌కీలా గొప్ప మ‌న‌సుపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.