చంపుతానంటున్న‌ స‌మంత‌..అదిరిన ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్‌!

మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి ప్రధాన పాత్రల్లో రాజ్ అండ్ డీకే తెర‌కెక్కించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ రెండేళ్ల క్రితం ఓటీటీ వేదికగా విడుద‌లై ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ది ఫ్యామిలీ మ్యాన్ 2 రూపొందుతుంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌లో.. సమంత అక్కినేని టెర్రరిస్టుగా క‌నిపించ‌నుంది.

ఇప్ప‌టికే పలుమార్లు ఈ సిరీస్ స్ట్రీమింగ్ వాయిదా పడింది. అయితే తాజాగా ఈ సిరీస్‌ను జూన్ 4న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. శ్రీకాంత్‌(మనోజ్‌ భాజ్‌పాయ్‌).. జాతీయ దర్యాప్తు సంస్థకు చెందిన స్పెషల్‌ సెల్‌లో పని చేసే ఓ మధ్యతరగతి వ్యక్తిగా క‌నిపించ‌నున్నాడు.

మరోవైపు సమంత సూసైడ్‌ బాంబర్‌గా క‌నిపించింది. డీ గ్లామర్ అండ్ నెగిటివ్ రోల్‌లో కనిపించిన స‌మంత‌.. వాళ్లను నేను చంపుతా అంటూ ఫుల్ ఫైర్‌గా చెబుతోంది. సీజన్ 1 కంటే సీజన్ 2 మరింతగా ఉత్కంఠతను రేకెత్తించేలా ఉంటుంద‌ని తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ బ‌ట్టీ అర్థం అయిపోతుంది. మొత్తానికి అదిరిపోయిన ఈ ట్రైల‌ర్ సిరీస్‌పై అంచ‌నాల‌ను పెంచేసింది.