`ఆర్ఆర్ఆర్‌`లో ఆ 20 నిమిషాలు క‌న్నుల పండ‌గేన‌ట‌!?

rrr

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్‌. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు.

షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా అక్టోబర్ 13 వ తేదీన విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్‌. అయితే ఈ చిత్రంలో పర్టిక్యులర్ గా ఓ 20 నిమిషాలు వెండితెరపై క‌న్నుల పండుగలా ఉంటుందట.

ఆ ఇరవై నిమిషాల భీకర పోరాట సన్నివేశంతోనే రాజమౌళి ఇద్దరు అగ్ర హీరోలను కలుపుతాడని.. ఆ సీన్ మొత్తం సినిమాకే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని బ‌లంగా టాక్ వినిపిస్తోంది. మ‌రి ఆ సీన్ ఎలా ఉండ‌బోతుందో తెలియాలంటే.. విడుద‌ల వ‌రకు వెయిట్ చేయాల్సిందే.