పెళ్లికి ముందే ప్రియుడితో శ్రుతిహాస‌న్ ర‌చ్చ..ఫొటోలు వైర‌ల్!

శ్రుతి హాస‌న్‌.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత క్రాక్ సినిమాతో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత వ‌కీల్ సాబ్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఈ రెండు చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో.. శ్రుతి ఫుల్ జోష్‌లో ఉంది.

ఇక ప్ర‌స్తుతం ఈమె ప్ర‌భాస్ స‌ర‌స‌న స‌లార్ చిత్రంలో న‌టిస్తోంది. సినిమా విష‌యాలు ప‌క్క‌న పెడితే.. శ్ర‌తి ప్ర‌ముఖ ఆర్టిస్ట్ శంతను హజరికాతో ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్రత్యక్షంగా ప్రేమలో ఉన్నట్టు ప్రకటించకపోయినా.. వారు చేసే పోస్ట్‌లు, వారిద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని చాటుతున్నాయి.

ఇక తాజాగా శాంత‌నుతో క‌లిసి ర‌చ్చ చేస్తున్న‌ట్టు పేర్కొంది శ్రుతి. త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో శాంత‌నుతో క‌లిసి డిఫ‌రెంట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌తో ఫొటోల‌కు ఫోజులిచ్చింది. ఈ ఫొటోల‌కు బెస్టీతో లాక్‌డౌన్ అంటూ కామెంట్ పెట్టింది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. పెళ్లికి ముందే శ్రుతి రచ్చ మొద‌లుపెట్టేసిందిగా, సూప‌ర్ పిక్స్ అంటూ నెటిజ‌న్లు ఈ ఫొటోల‌పై ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు.

https://www.instagram.com/p/COxZ6K4hhE-/?utm_source=ig_web_copy_link