రాజ‌మౌళికి షాకిచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..ఏం జ‌రిగిందంటే?

May 5, 2021 at 9:02 am

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రాం భీమ్‌గా, చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా క‌నిపించ‌నున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబర్‌ 13న విడుద‌ల చేయనున్నారు.

అయితే అదే స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా త‌న సినిమాను విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం ప‌వ‌న్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మలయాళం సూప‌ర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ రీమేక్ ఒక‌టి. ఈ చిత్రంలో రానా మ‌రో హీరోగా న‌టిస్తుంటే.. నిత్యామీనన్‌, ఐశ్యర్యరాజేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రాన్ని ద‌స‌రా బ‌రిలో దింపాల‌ని చిత్ర యూనిట్ నిర్ణ‌యించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో జ‌క్క‌న్న‌కు ప‌వ‌న్ షాకిచ్చిన‌ట్టు అయింది. ఎందుకంటే.. రెండు బ‌డా చిత్రాలు ఒకేసారి విడుద‌ల అయితే.. ఖ‌చ్చితంగా క‌లెక్ష‌న్స్‌పై ప్ర‌భావం ప‌డుతుంది.

రాజ‌మౌళికి షాకిచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..ఏం జ‌రిగిందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts