పెళ్లి పీట‌లెక్క‌బోతున్న అరియానా..వ‌రుడు ఎవ‌రంటే?

May 5, 2021 at 9:33 am

అరియానా గ్లోరీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆర్జీవీ ఇంట‌ర్వ్యూలో పాపుల‌ర్ అయిన ఈ బ్యూటీ.. బిగ్ బాస్ సీజ‌న్ 4లో అడుగు పెట్టి సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్‌లో అవినాష్‌తో క‌లిసి ఈమె పండించిన ల‌వ్ ట్రాక్ బాగా వ‌ర్కోట్ అయింది.

ఒక ఈ షో త‌ర్వాత టీవీ ప్రోగ్రామ్స్‌, చిన్న చిన్న సినిమాలు, ఫొటో షూట్లు ఇలా క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుతున్న అరియానా.. త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతుంద‌ని ఓ వార్త ప్ర‌స్తుతం నెట్టింట్లో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అయితే వ‌రుడు వివ‌రాలు మాత్రం ఇంకా బ‌య‌ట‌కు రాలేదు.

కానీ, అరియానా పెళ్లి ఫిక్స్ అయింద‌ని.. ఏ ఏడాదిలోనే ఆమె వివాహం జ‌ర‌గ‌నుంద‌ని బ‌లంగా టాక్ న‌డుస్తోంది. మ‌రోవైపు ఈ ఏడాదిలోనే తన పెళ్లి ఉంటుందని ప్రకటించాడు అవినాష్‌. మంచి ముహుర్తాలు ఉంటే పెళ్లికి రెడీ అంటూ ఓపెన్‌ అయ్యాడు. దీంతో అరియానా పెళ్లాడితే అవినాష్‌నేనా అంటూ ఆలోచ‌న‌లో ప‌డ్డారు నెటిజ‌న్లు.

పెళ్లి పీట‌లెక్క‌బోతున్న అరియానా..వ‌రుడు ఎవ‌రంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts