అమెరికాకు ప‌య‌న‌మ‌వుతున్న‌ రజనీ..ఎందుకోస‌మంటే?

May 5, 2021 at 8:31 am

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ ప్ర‌స్తుతం అన్నాత్త సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సన్‌ పిక్చర్స్‌ రూపొందిస్తున్న అన్నాత్త చిత్రంలో నయనతార, కీర్తీ సురేష్‌, మీనా, కుష్బూ త‌దిత‌రులు నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ చివరి షెడ్యూల్ జ‌రుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే ర‌జ‌నీ అమెరికాకు ప‌య‌నమ‌వ్వ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న రజనీ.. సాధారణ వైద్యపరీక్షల కోసం మళ్లీ అమెరికా వెళ్లనున్నట్లు కోలీవుడ్ వ‌ర్గాల్లో వార్త‌లు వ‌స్తున్నాయి.

అక్కడ ఇర‌వై రోజుల బసచేసి వైద్యపరీక్షలు పూర్తిచేసుకొని చెన్నైకు తిరిగిరానున్నట్లు కోలీవుడ్‌వర్గాలు తెలిపాయి. ఇక ఇక్క‌డ‌కు వచ్చిన త‌ర్వాత త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప్ర‌క‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది.

అమెరికాకు ప‌య‌న‌మ‌వుతున్న‌ రజనీ..ఎందుకోస‌మంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts