`ఆర్ఆర్ఆర్‌` నుంచి కొమ‌రం భీమ్ కొత్త లుక్ అదిరిపోయిందిగా!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కోమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ అలీయా భట్, హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అయితే ఈ రోజు ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఆర్ఆర్ఆర్ నుంచి కోమరం భీంకు సంబంధించిన ఓ కొత్త పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో లక్ష్యాన్ని బళ్ళెంతో గురి పెట్టిన గొండు బెబ్బులి కొమురం భీం గా సరికొత్త మేకోవర్ లో ఎన్టీఆర్ అద్భుతంగా క‌నిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Image