నాని స్టార్ అవ్వ‌డానికి డాక్టర్ బాబే కార‌ణ‌మ‌ట‌..అదెలాగంటే?

కార్తీక దీపం ఫేమ్ డాక్టర్ బాబు నిరుపమ్ పరిటాల వ‌ల్లే నాని స్టార్ హీరో అయ్యాడ‌ట‌. విన‌డానికి కాస్త విచిత్రంగా, విడ్డూరంగా ఉన్నా.. న‌మ్మాల్సిందే అంటున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన నాని.. స‌హ‌జ‌సిద్ధ‌మైన న‌ట‌న‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగాడు.

ఇది అంద‌రికీ తెలిసిన విష‌యమే. అయితే కెరీర్ తొలినాళ్ల‌లో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తోన్న నాని అష్టా చెమ్మా సినిమాకు హీరోగా ఎంపిక‌య్యాడు. అయితే నాని అష్టా చెమ్మాకు ఎంపికవ్వడానికి ముందు కొంత ఆసక్తికర డ్రామా నడిచింద‌ట‌. నిజానికి కార్తీకదీపం సీరియ‌ల్‌ హీరో నిరుపమ్ పరిటాలను మొదట అష్టా చెమ్మా సినిమా కోసం ఆడిషన్ కు రమ్మన్నార‌ట‌. ఈ విష‌యాన్ని నిరుప‌మ్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు.

ఇక ఆడిషన్ కు వెళ్లిన నిరుప‌మ్‌..తాను కొన్ని సీరియల్స్ చేస్తున్నానని చెప్పాడ‌ట‌. అయితే ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ నిరుపమ్ ను కనీసం ఆడిషన్ కూడా చేయకుండానే.. మరో కొత్త కుర్రాడిని తీసుకున్నార‌ట‌ దర్శక నిర్మాతలు. ఆ కొత్త కుర్రాడే ఇప్పటి మన నాచురల్ స్టార్ నాని. ఇదే నానికి మొద‌టి సినిమా. ఇంద్రగంటి మోహన కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించ‌డ‌మే కాదు.. నానికి వ‌రుస ఆఫ‌ర్లు కూడా తెచ్చిపెట్టింది.