మహిళకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..!?

May 5, 2021 at 2:25 pm

మహిళల కోసం ఇప్పటికే పలు పథకాలను తీసుకొచ్చింది ఏపి రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఏపి రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అందరి మహిళలు మొబైల్‌ ఫోన్‌ కొన్నవారికి, 10 శాతం రాయితీ ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మహిళలకు ఈ బహుమతిని ఇస్తున్నట్లు ప్రకటించారు.

మార్చి 8వ తేదీ సోమవారం రోజు మొబైల్‌ ఫోన్‌ కొనుకొని, దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న వారికీ మాత్రమే 10 పెర్సెంట్ రాయితీ ఆఫర్‌ ఇస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు సౌకర్యంగా క్యూఆర్‌ కోడ్‌తో 2000 స్టాండ్‌లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా దినోత్సవం రోజున ఎంపిక చేసిన షాపింగ్‌ సెంటర్లలో మొబైల్‌ ఫోన్లను కొనుకున్న మహిళలకు 10శాతం రాయితీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

మహిళకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts