కోట్లు పుచ్చుకుంటున్న బ‌న్నీ మొద‌టి సంపాద‌న ఎంతో తెలుసా?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అస‌వ‌రం లేదు. పెద్ద కుటుంబం నుంచి వ‌చ్చినా.. త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని కోట్ల‌లో రెమ్యున‌రేష‌న్ పుచ్చుకునే స్టార్ హీరో స్థాయికి ఎదిగాడీయ‌న‌. ప్ర‌స్తుతం ఒక్కో సినిమా ప‌ది కోట్ల‌కు పైగానే పారితోష‌కం తీసుకుంటున్న బ‌న్నీ తొలి సంపాద‌న ఎంతో తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు.

ఎందుకంటే ఎవ‌రూ ఊహించ‌లేనంత‌ తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడు బన్నీ. ఇంత‌కీ ఎంత తీసుకున్నాడో తెలుసా.. కేవలం వంద రూపాయిలు. ఆ వంద రూపాయిలు ఇచ్చిందెవ‌రో కాదు.. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బ‌న్నీ ఇంకా సినిమాల్లోకి రాక‌ముందు.. చిరంజీవి ఇంట్లో ఓ ఫంక్ష‌న్ జ‌రిగింద‌ట‌. ఆ ఫంక్ష‌న్‌కు రాఘవేంద్రరావు కూడా వచ్చారు.

అయితే ఈ ఫంక్ష‌న్‌లో బన్నీ డ్యాన్స్ చేయ‌గా.. అది చూసిన రాఘవేంద్రరావు ముచ్చటపడి మ‌న హీరోకు రూ.100 ఇచ్చారట. డ్యాన్స్ చేసి సంపాదించిన ఆ వంద రూపాయిలే త‌న తొలి సంపాద‌న‌ని.. ఆ వంద ఇప్ప‌టికీ భ‌ద్రంగానే ఉన్నాయ‌ని బ‌న్నీ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక రాఘవేంద్రరావు తెర‌కెక్కించిన గంగోత్రి సినిమాతోనే బ‌న్నీ హీరోగా టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే.