బాల‌య్య బ‌ర్త్‌డే..అదిరిపోయే గిఫ్ట్ ప్లాన్ చేస్తున్న బోయ‌పాటి?!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటితో చేస్తున్న తాజా చిత్రం అఖండ‌. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్‌, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన ఫ‌స్ట్ గ్లింప్స్, టైటిల్ రోర్‌, పోస్టర్ల ద్వారా సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక క‌రోనా సెకెండ్ ఉధృతి లేకుండా ఉండి ఉంటే.. ఈ నెల 28న అఖండ గ్రాండ్‌గా విడుద‌ల అయ్యేది. కానీ, ఇప్ప‌డా ప‌రిస్థితులు లేదు. అయితే జూన్ 10న బాల‌కృష్ణ బ‌ర్త్‌డే.

ఈ సంద‌ర్భంగా నంద‌మూరి అభిమానుల కోసం బోయ‌పాటి శ్రీ‌ను అదిరిపోయే గిఫ్ట్ రెడీ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. బాల‌య్య బ‌ర్త్‌డేకి అఖండ టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్నార‌ని.. ఇప్ప‌టికే అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.