వ్యాక్సిన్ వేయించుకుంటే బీర్ ఫ్రీ..త్వ‌ర‌ప‌డండి!

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఈ మ‌హ‌మ్మారిని అరిక‌ట్టేందుకు ప్రభుత్వాలు జోరుగా వ్యాక్సిన్ పంపిణీ ప్ర‌క్రియ కొన‌సాగిస్తోంది. అయితే ప‌లు అపోహ‌లు కార‌ణంగా యువ‌త వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రాక‌పోవ‌డంతో..ప్ర‌భుత్వాలు వినూత్న ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే వ్యాక్సిన్ వేసుకున్న యువతకు బీరు బాటిల్‌ను ఫ్రీగా ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే తాజాగా అగ్రరాజ్య అధినేత జో బైడెన్ జూలై 4 నాటికి 70 శాతం మంది యువతకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే వ్యాక్సిన్ వేయించుకునేందుకు యువత వెన‌క‌డుగు వేస్తుండ‌డంతో.. వారికి ఆకట్టుకునేందుకు బైడెన్ కొత్త కొత్త మార్గలను అన్వేషించి దిశానిర్దేశం చేశారు.

ఫెడరల్, రాష్ట్ర మరియు స్థానిక అధికారులు ఫార్మసీలు, రెస్టారెంట్లు, బీర్ల ఉత్పత్తిదారులు, సూపర్ మార్కెట్లు, క్రీడా బృందాలతో కలిసి యువత వద్దకు వెళ్తున్నారు. టీకా తీసుకున్న యువతకు బీర్ బాటిల్‌ను, డోనట్స్‌ను, సేవింగ్స్ బాండ్స్ ఆఫర్ చేస్తూ టీకా తీసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగానే న్యూజెర్సీ గవర్నర్ షాట్ అండ్ ఏ బీర్ ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేసి.. మే నెలలో టీకా మొదటి డోసు తీసుకున్న యువత తమ వ్యాక్సినేషన్ కార్డు ద్వారా ఫ్రీగా బీర్‌ను పొందొచ్చు అని ప్ర‌క‌టించింది. దీంతో ఈ ఆఫ‌ర్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

Share post:

Popular