క‌మ‌ల్‌కు ఒక్క సీటూ ఇవ్వని తమిళులు..అదే కార‌ణ‌మా?

ప్రముఖ సినీ నటుడు కమల్‌ హాసన్ మక్కల్‌ నీది మయ్యమ్ పార్టీని స్థాపించింది త‌మిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేయాలని భావించారు. కానీ, క‌మ‌ల్‌కు నిరాశే మిగిలింది. 142 స్థానాల్లో పోటీ చేసిన కమల్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యమ్, ఒక్కటంటే ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు.

కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్ కూడా సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసస్ ‌(బీజేపీ) చేతిలో ఓటమి పాలయ్యారు. 1,300 ఓట్ల తేడాతో ఎమ్‌ఎన్‌ఎం చీఫ్ కమల్‌హాసన్ ఓడిపోయారు.

అయితే తాను ఓట్ల కోసం డబ్బులు పంచబోనని, సరికొత్త రాజకీయ వాతావరణాన్ని సృష్టించడమే తన లక్ష్యమని ముందే ప్రకటించిన కమల్. అన్న‌ట్టుగానే విలువలకు కట్టుబడి ఎంఎన్ఎం తరఫున బరిలోకి దిగిన వారంతా ఎక్కడా డబ్బులు పంచలేదు. అందుకే వారెవరికీ ఓట్లు పడలేదని ఇప్పుడు నెట్టింట్లో ప్ర‌చారం జ‌రుగోతంది.