రష్మిక టాటూ వెన‌క అస‌లు సీక్రెట్స్ ఏంటో తెలుసా?

`ఛ‌లో` సిసిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌ష్మిక మంద‌న్నా త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళ్ మ‌రియు హిందీ భాష‌ల్లో వ‌రుస ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. రష్మిక మందాన్న చేతికి ఇర్రిప్లేసబుల్ అనే టాటూ ఉంటుంది.

rashmika-madhana - Great Telangaana

ఆ టాటూ అర్థం ఏంటో గ‌తంలో ప‌లు సార్లు వివ‌రించింది. అయితే తాజాగా రష్మిక తన ఇన్ స్టాగ్రాంలో లైవ్‌లోకి వచ్చారు. తన ఫాలోవర్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధనాలు చెప్పారు. ఈ క్ర‌మంలోనే ఓ నెటిజ‌న్ మ‌రో సారి టాటూ వెన‌క ఉన్న అస‌లు సీక్రెట్స్ ఏంటి అని ప్ర‌శ్నించాడు.

అందుకు ర‌ష్మిక‌.. నీలాంటి వాళ్లు ఒక్కరే ఉంటారు.. నిన్ను ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు.. నీకు నువ్వే ఉండాలి.. నీకు నువ్వే మిగులుతావ్.. అదే ఇర్రిప్లేసబుల్ అని స‌మాధానం చెప్పింది. ఇక త‌న టాటూపై ర‌ష్మిక ఇచ్చిన వివ‌ర‌ణ అభిమానుల‌ను, నెటిజ‌న్లు తెగ ఆక‌ట్టుకుంది.