ప్రస్తుతం భారత్‌ను కరోనా వైరస్ ఏ స్థాయిలో వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కరోనా కోరలు చాస్తుండడంతో.. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాలు ఊహించని స్థాయిలో నమోదు అవుతున్నారు. ఇక ఈ కరోనా దెబ్బ ఐపీఎల్ 2021పై కూడా పడింది.
కరోనా వేగంగా విస్తరిస్తుండడంతో ఇప్పటికే రవిచంద్రన్ అశ్విన్ (ఢిల్లీ క్యాపిటల్స్), ఆండ్రూ టై, లియామ్ లివింగ్ స్టోన్(రాజస్థాన్ రాయల్స్), ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)లు టోర్నీ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నారు.
అయితే తాజాగా భారత అంపైర్ నితిన్ మీనన్‌తో పాటు ఆస్ట్రేలియా అంఫైర్ పాల్ రీఫెల్ కూడా ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ తప్పుకున్న విషయాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి వెల్లడించారు. అయితే ఒకరి తర్వాత ఒకరు ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో.. క్రికెట్ ప్రియుల్లో ఆందోళన మొదలైంది.