రత్తాలు రత్తాలు అంటూ మెగాస్టార్ తో చిందేసిన అందాల భామ రాయ్ లక్ష్మీ. ఈ బ్యూటీ టాలీవుడ్ లో చాలా ప్రయత్నాలు చేసింది. కానీ పెద్దగా పేరు రాకపోవడంతో నిరాశ చెందింది. దీంతో బాలీవుడ్ కు మకాం మార్చేసింది. అక్కడ కూడా చిన్న చితకా అవకాశాలే తప్ప పెద్దగా రాలేదు.
దీనితో ఆమె జిమ్ లో బాగా కష్టపడి ఇప్పుడు ఎవరూ గుర్తించలేని విధంగా మారింది. కాస్త బొద్దుగా ఉండే ఈ బ్యూటీ సూపర్ నాజూకుగా మారిపోయింది. ఎప్పటికప్పుడు తన లేటెస్టు ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఎక్కువగా బికనీ షోలు చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకొని అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. ఇక ఈ భామ లేటెస్టుగా పోస్టు చేసిన పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి.