మహేష్‌ బాబు ‘AMB’ మల్టీఫ్లెక్స్ కి అరుదైన అవార్డు.. !

April 15, 2021 at 12:37 pm

 

మహేష్‌బాబు, ఏషియన్స్ సినిమాస్‌తో కలిసి హైదరాబాద్‌లో ఏఎంబీ ఏషియన్‌-మహేష్‌బాబు మల్టీఫ్లెక్స్ ని నిర్మించిన సంగతి అందరికి తెలిసిందే. రెండేళ్ల క్రితమే ఇది మొదలయింది. అత్యాధునిక సదుపాయాలతో, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, లగ్జరీగా ఈ మల్టీఫ్లెక్స్ ని నగరంలో గచ్చిబౌలి ఏరియా లోని దీని నిర్మించారు. ఇంటీరియర్ డిజైన్‌తో మొత్తం 1638 సీట్ల సామర్థ్యంతో ఈ మల్టీప్లెక్స్ ఏర్పాటు చేశారు.

వీవీఐపీ లాంజ్, పార్టీ జోన్, స్పెషల్ కిడ్స్ జోన్, లగ్జరీ సీటింగ్ వంటి ఆధునిక సదుపాయాలతో ఏఎంబీ సినిమాస్ ప్రేక్షకులకు వరల్డ్ క్లాస్ అనుభూతిని ఇస్తుంది. తాజాగా దీనికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ఇనవేషన్ అవార్డ్స్-2021లో గ్లోబల్ గుర్తింపును పొందినట్లు తాజాగా ట్విట్టర్ వేదిక ద్వారా తెలిపారు. ఇనవేషన్ అవార్డ్స్ 2021లో లీజర్ అండ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీ కింద ఏఎంబీ సినిమాస్ ఫైనలిస్టుగా ఎంపిక అవ్వటం విశేషం. ఈ కేటగిరీలో భారతదేశం నుండి ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్‌ని మాత్రమే సెలెక్ట్ చేసారు.

 

 

 

 

<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>Our world-class movie experience has attained global recognition at the Inavation Awards 2021! We’ve been nominated as the finalist from India under the Leisure &amp; Entertainment category referred by AV Integration Distribution Ltd. A big thank you from us for making this possible! <a href=”https://t.co/u3rm4FXstS”>pic.twitter.com/u3rm4FXstS</a></p>&mdash; AMB Cinemas (@amb_cinemas) <a href=”https://twitter.com/amb_cinemas/status/1382320437099569153?ref_src=twsrc%5Etfw”>April 14, 2021</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

మహేష్‌ బాబు ‘AMB’ మల్టీఫ్లెక్స్ కి అరుదైన అవార్డు.. !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts