14 గంటల పాటు ఆర్‌టీజీఎస్‌ సేవలకు అంతరాయం .. ఎందుకంటే..?

కరోనా వైరస్ మొదలైనప్పటినుండి ప్రజలు ఎక్కువగా డిజిటల్ లావాదేవీలను జరుపుతున్నారు. బయటకు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలించకపోవటంతో నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌ల ద్వారా ఇంటి నుంచి డబ్బును ట్రాన్స్‌ఫర్ జరుపుతున్నారు. 2019తో పోల్చితే 2020లో డిజిటల్ చెల్లింపులు 80 శాతం పెరిగాయి. జనం ఈ విధానానికే మెల్లిగా అలవాటు పడుతుండటంతో ఆరబీఐ ఆర్టీజీఎస్ సేవల్లో కొన్ని కీలక మార్పులు చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది.

దీనిలో భాగంగా పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు నిర్వహించే వారికి ఆర్‌బీఐ ఒక అలర్ట్‌ను జారీ చేసింది. ఈ నెల 18న దేశవ్యాప్తంగా రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ ఆర్‌టీజీఎస్ సేవలను 14 గంటలపాటు నిలిపివేస్తున్నట్లు ఆర్బిఐ తెలిపింది. దీనిలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకూ ఆర్టీజీఎస్ సేవలు నిలిపివేస్తున్నాయి. కానీ నెఫ్ట్ కు మాత్రం ఇలాంటి పరిమితులు ఏమి లేవు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఆర్‌టీజీఎస్ సేవలు 24 గంటల పాటు అందుబాటులోకి వచ్చాయి.