భార‌త్‌లో క‌రోనా విశ్వ‌రూపం..నిన్నొక్క‌రోజే 904 మృతి!

April 12, 2021 at 10:54 am

కంటికి క‌నిపించ‌కుండా ప్ర‌పంచ‌దేశాల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న క‌రోనా వైర‌స్‌.. ఇప్ప‌టికే కొన్ని లక్షల మంది ప్రాణాలను బ‌లితీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌జ‌లు అత‌లా కుత‌లం అయిపోతున్నారు. ఆ మ‌ధ్య త‌గ్గిన‌ట్టే త‌గ్గిన క‌రోనా.. ప్ర‌స్తుతం వేగంగా విజృంభిస్తోంది.

భార‌త్‌లోనూ క‌రోనా విశ్వరూపం చూపిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశ‌వ్యాప్తంగా 1,68,912 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో క‌రోనా పాజిటివ్ కేసులు 1,35,27,717 కి చేరింది. నిన్నొక్క రోజే 904 మంది క‌రోనాకు బ‌లైపోగా.. ప్ర‌స్తుతం దేశంలో మృతుల సంఖ్య 1,70,179 ద‌గ్గ‌ర నిలిచింది.

అలాగే నిన్న క‌రోనా నుంచి 75,086 మంది రిక‌వ‌రీ అయ్యారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా మొత్తం రికవరీల సంఖ్య 1,21,56,529 కు చేరుకుంది. ప్ర‌స్తుతం దేశంలో 12,01,009 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 25,78,06,986 కరోనా పరీక్షలు నిర్వహించారు.

భార‌త్‌లో క‌రోనా విశ్వ‌రూపం..నిన్నొక్క‌రోజే 904 మృతి!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts