పవన్ పై సంచలన కామెంట్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ ..!

jyothi

చిత్ర పరిశ్రమలో బిగ్ బాస్ బ్యూటీ జ్యోతి గురించి తెలియని వారంటూ ఉండరు. గత రెండు రోజులుగా జ్యోతి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. అడిగిన వాళ్లకు అడిగినట్టు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన వ్యక్తిగత జీవితంలోని సీక్రెట్స్ ను బయటపెట్టేస్తోంది. ఈ క్రమంలో పవన్ గురించి కూడా కొన్ని కామెంట్స్ చేసింది.

అయితే సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా మాట్లాడడని, తన పని ఏదో తాను చూసుకుంటాడని.. అలాంటిది మొదటిసారి పవన్, షూటింగ్ సమయంలో తన మీద కవిత్వం రాసేశారని, పవన్ కళ్యాణ్ తనని ట్రై చేశాడని అన్నట్టు జ్యోతి సెన్సేషనల్ కామెంట్ చేసింది. గుడుంబా శంకర్ సినిమాలో జ్యోతి, పవన్ కళ్యాణ్ మధ్య కొన్ని సీన్స్ ఉన్నాయి. బహుశా ఆ సీన్స్ షూటింగ్ సమయంలోనే పవన్ సరదాగా ఈ హాట్ ఆంటీ పై కొన్ని సరదా కామెంట్స్ చేసి ఉండొచ్చు. దానికి పవన్ తన గురించి కవిత్వం రాశాడని జ్యోతి ఇప్పుడు చెప్పుకుంటుంది.