స‌మంత‌కు మ‌రో పేరు కూడా ఉంది..ఏంటో తెలుసా?

సమంత.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన ఈ భామ‌.. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాల్లో న‌టించి స్థార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక నాగచైత‌న్యను పెళ్లాడి స‌మంత అక్కినేనిగా మారిపోయిన ఈ బ్యూటీ.. వివాహం త‌ర్వాత కూడా కెరీర్‌ను సక్సెస్ ఫుల్‌గా రాన్ చేస్తోంది.

మ‌రోవైపు కొత్త కొత్త‌ వ్యాపారాలు స్టార్ట్ చేస్తూ..బిజినెస్‌ ఉమెన్‌గానూ రాణిస్తుంది. అలాగే ప్రత్యూష అనే ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి ఎన్నో విధాలుగా చేయూతనిచ్చింది. అయితే స‌మంత‌, స్యామ్ అని పిలిచుకునే ఈ ముద్దుగుమ్మ‌కు మ‌రో పేరు కూడా ఉంది.

వాస్త‌వానికి సమంత పూర్తి పేరు సమంత రూత్‌ ప్రభు. కానీ, స్నేహితులు మ‌రియు కుటుంబ స‌భ్యులంద‌రూ ఆమెను యశోద అని పిలుస్తారట. కాగా, ప్ర‌స్తుతం స‌మంత గుణశేఖర్ ద‌ర్శ‌క‌త్వంలో శాకుంతలం సినిమా చేస్తోంది. అలాగే ఈమె న‌టించిన ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది.