త‌మ్ముడు హీరోయిన్‌తో అన్న రొమాన్స్‌

బాహుబ‌లి సినిమా త‌ర్వాత తెలుగు తెర‌పై మ‌ళ్లీ త‌మ‌న్నా క‌నిపిస్తోంది. బాహుబ‌లి 2 త‌ర్వాత ఆమె తెలుగులో ఏ ప్రాజెక్టుకు సైన్ చేయ‌లేదు. ఇప్పుడు ఓ సినిమాకు సైన్ చేసిన‌ట్టు టాక్ విన‌ప‌డుతోంది. నంద‌మూరి ఫ్యామిలీలో ఇప్ప‌టికే ఎన్టీఆర్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన త‌మ‌న్నా ఇప్పుడు ఎన్టీఆర్ త‌న్న క‌ళ్యాణ్‌రామ్‌తో న‌టించేందుకు ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

యాడ్ ఫిల్మ్ మేకర్, 180 – ఈ వ‌య‌సిక రాదు అనే తెలుగు సినిమాకు దర్శకత్వం వహించిన జయేంద్ర దర్శకుడిగా, పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థ ఓ సినిమా నిర్మించబోతోంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ హీరో. ఈ సినిమాకే ఇప్పుడు తమన్నా హీరోయిన్ గా ఎంపికైంది.

ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ బ్లూ ప్లానెట్ బ్యాన‌ర్‌లో న‌టిస్తోన్న సినిమా షూటింగ్ అక్టోబ‌ర్‌కు కంప్లీట్ అవుతుంది. ఈ సినిమా త‌ర్వాత క‌ళ్యాణ్ న‌టించే ఈ సినిమాలో త‌మ్మూ బేబీ హీరోయిన్‌గా ఎంపికైంద‌ట‌. ఎన్టీఆర్ ప‌క్క‌న ఊస‌ర‌వెల్లి సినిమాలో న‌టించిన ఈ మిల్కీబ్యూటీ ఎన్టీఆర్‌కు హిట్ ఇవ్వ‌లేదు. మ‌రి ఇప్పుడు అన్న‌తో న‌టిస్తోన్న త‌మ‌న్నా క‌ళ్యాణ్‌రామ్‌కు హిట్ ఇస్తుందో ? లేదో ? చూడాలి.